BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 05 August 2026, 04:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాకాలంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి పెనుగొలనులో 104 సంచార ఆరోగ్య వాహన వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 04:40 PM
179 వీక్షణలు

పెనుగొలను, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం 104 సంచార ఆరోగ్య వాహన వైద్య శిబిరం నిర్వహించారు.

వైద్య అధికారిణి శశిప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో రక్తపోటు, మధుమేహం, జ్వరం తదితర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వైద్య అధికారిణి శశిప్రియ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జ్వరం, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స పొందాలని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ శిబిరంలో హెల్త్ సూపర్వైజర్ బి.హెచ్. సురేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ షేక్ సుల్తానా, ఏఎన్ఎం రత్నమాల, ఎంపీహెచ్ఏ పుల్లారావు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.