BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లింగంపర్తిలో వసంతయ్య సంస్మరణ సభ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:30 PM
93 వీక్షణలు

ఈ నెల 23న గొప్ప ప్రజాస్వామ్యవాది బుగత వసంతయ్య 

సీపిఐ యం ఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన బుగత వసంతయ్య మృతి పట్ల సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రావు, ఐలాజ్ రాష్ట్ర కార్యదర్శి బుగత శివల తండ్రి అయిన వసంతయ్య మరణవార్త తెలుసుకున్న లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్, ఐఫ్వా రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగమణి, ఏఐసీసీటీయూ రాష్ట్ర కార్యదర్శి ఏ. ఉదయ్ కిరణ్ లింగంపర్తికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డి. హరినాథ్ మాట్లాడుతూ బుగత వసంతయ్య గొప్ప ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు. ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత కలిగిన ఆయన తన కుటుంబ సభ్యులను కూడా సామాజిక, ప్రజా ఉద్యమాల పట్ల చైతన్యవంతులుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఆయన అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే బుగత బంగార్రావు, బుగత శివలకు ప్రజా జీవితంలో మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. వసంతయ్య మరణం కుటుంబానికే కాకుండా ఆయనను అభిమానించే ప్రజాస్వామిక, ప్రజా ఉద్యమ శ్రేణులకు తీరని లోటని అన్నారు. కామ్రేడ్ బుగత వసంతయ్య సంస్మరణ సభ ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు లింగంపర్తిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ సంస్మరణ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామికవాదులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డి. హరినాథ్, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.