BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 08:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధుమేహ నియంత్రణకు అప్రమత్తతే అసలైన ఆయుధం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Nov, 2026 - 08:23 PM
37 వీక్షణలు

ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులతోనే వ్యాధికి అడ్డుకట్ట గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్. వైద్యాధికారులు 

మధుమేహ నియంత్రణకు అప్రమత్తతే అసలైన ఆయుధం ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులతోనే వ్యాధికి అడ్డుకట్ట గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్. వైద్యాధికారులు డాక్టర్ కొండా నాగార్జున, డాక్టర్ దాసరి రమేష్

గుంటూరు: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల మధుమేహం వేగంగా విస్తరిస్తోందని, ఈ వ్యాధి నియంత్రణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గుంటూరు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం (సీ.జీ.హెచ్.ఎస్.) చీఫ్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ కొండా నాగార్జున, డాక్టర్ దాసరి రమేష్ సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గుంటూరు నగరం పాలెంలోని సీ.జీ.హెచ్.ఎస్. వెల్‌నెస్ సెంటర్‌లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ మధుమేహం వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారినీ ప్రభావితం చేసే సమస్యగా మారుతోందన్నారు. రోజువారీ ఆహారంలో అధిక చక్కెర, కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలని, రుచికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలను అందుబాటులోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ఫాస్ట్‌ఫుడ్‌ వల్ల కలిగే అనారోగ్య ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఆహార పదార్థాల ప్యాకేజీలపై హెచ్చరికలు ముద్రించే విధానం అమలు చేయాలని సూచించారు. ప్రతిరోజూ నడక, వ్యాయామం, బరువు నియంత్రణతో పాటు చురుకైన జీవనశైలిని అలవర్చుకోవాలని తెలిపారు. మధుమేహం ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని, కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు, అధిక బరువుతో బాధపడేవారు క్రమం తప్పకుండా రక్తపరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం సీ.జీ.హెచ్.ఎస్. లబ్ధిదారులకు రక్తపరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సలహా మండలి సభ్యులు గుమ్మడి సీతారామయ్య చౌదరి, కట్టా వెంకటేశ్వర్లు చిరుధాన్యాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఫార్మసిస్టులు కౌసల్య, ఆయేషా, సునీల్, సీనియర్ నర్సింగ్ అధికారి హేమసుందరి, వైద్య సిబ్బంది పేరేశ్వరరావు, మురళీ, రామారావు తదితరులు పాల్గొన్నారు.