BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:53 pm
Posted by : K MAHESH

బాలలపై జరిగే నేరాల నియంత్రణకే గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 05:53 PM
22 వీక్షణలు

కమిటీ ఏర్పాటుతో బాలల హక్కులపై అవగాహనకు చర్యలు: సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకాంతం యాదవ్

మహబూబాబాద్ (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: గ్రామాల్లో బాలలపై జరిగే నేరాలను నియంత్రించడంతో పాటు, వారి హక్కులకు రక్షణ కల్పించేందుకే ప్రభుత్వం గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తోందని రావిరాల సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకాంతం యాదవ్ తెలిపారు.

శనివారం నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామంలో నెల్లికుదురు సెక్టార్ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎన్. సరిత ఆధ్వర్యంలో రావిరాల ఎంపీయూపీఎస్ పాఠశాలలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (వీసీపీసీ)ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామస్థాయిలో బాలలపై జరిగే నేరాలను అరికట్టడం, పిల్లలకు బాలల చట్టాలపై అవగాహన కల్పించడం, తల్లిదండ్రులకు బాలల హక్కుల గురించి వివరించడం కమిటీ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా, శారీరక, మానసిక వేధింపులు, బాలలతో భిక్షాటన చేయించడం, బాలల పట్ల లింగ వివక్ష వంటి సమస్యలను అరికట్టేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు.

ఈ కమిటీకి చైర్మన్‌గా సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకాంతం యాదవ్, కన్వీనర్‌గా అంగన్‌వాడీ టీచర్ కరుణ వ్యవహరించనున్నారు. సభ్యులుగా అంగన్‌వాడీ టీచర్లు కరుణ, సుభద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి, ఆశా వర్కర్ రాణి, మహిళా సంఘాల ప్రతినిధి యాకమ్మ తదితరులు ఉన్నారు.