BREAKING
thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం
Date of Publish : 23 September 2026, 07:06 am
Posted by : CHERUKU RAMESH

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన

తెలంగాణ
/ నల్గొండ / శాలిగౌరారం
Reporter
CHERUKU RAMESH శాలిగౌరారం మండల ఇన్వెస్టిగేషన్ ప్రతినిధి
23 Sep, 2026 - 07:06 AM
20 వీక్షణలు

శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం తక్కెడ్లపాడ్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న కుటుంబాలను గుర్తించి ఇళ్ల పంపిణీలో న్యాయం చేయాలని అధికారులను కోరారు.

గ్రామస్తుల కథనం ప్రకారం.. 2003–04 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు పొందిన కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని అప్పటి మాజీ సర్పంచ్ గోదాల నరేందర్ రెడ్డి రాతపూర్వకంగా హామీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ జరిగినప్పటికీ తమకు న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియపై సమగ్ర విచారణ నిర్వహించి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కోరుతూ గ్రామస్తులు శాలిగౌరారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

అదేవిధంగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందజేసి తమ సమస్యను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మోదాల రాంబాబు, తిరుపారి రామ్మూర్తితో పాటు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన రికార్డులు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామస్తుల ఆరోపణలపై సంబంధిత అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.