వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వినాయక చవితి వేడుకలు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ N. శ్వేత, IPS కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పోలీసు అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు శ్రీనివాసు, సురేష్, ఏసీపీలు నాగయ్య, సురేందర్, ఆర్‌ఐలు సతీష్, ఉదయభాస్కర్, శ్రీధర్, ఇతర పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.