ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె
ఆత్రేయపురం: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఎలు చేపట్టిన సమ్మె శుక్రవారం 17వ రోజుకు చేరింది. వీఆర్ఎల సంఘం అధ్యక్షుడు లావరాజు ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా వీఆర్ఎలు మాట్లాడుతూ తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఎలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. నామినీ వీఆర్ఎలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యలను ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వీఆర్ఎలు పేర్కొన్నారు.
సమ్మెలో పాముల ప్రసాద్, చల్లపల్లి శ్రీనివాస్, సత్తి హేమకల, చిట్టిమేను వీరరఘవులు, కారంకి పోతయ్య, వారప్రకాష్, విప్పర్తి వెంకన్న, కట్టుంగ వీరబాబు, లంక సత్యనారాయణ, ర్యాలీ సత్యనారాయణ, కప్పల ఎలిజబెత్, జగతా రామకృష్ణ, యాళ్ల పనసరాముడు, కట్టుంగ గంగా, కాకరపర్తి బాబు, పెరవలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.