BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం
Date of Publish : 09 October 2026, 04:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో డిమాండ్ల సాధన కోసం మోకాళ్లపై వీఆర్ఏల నిరసన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 04:30 PM
2 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తమ సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన హామీ లేదా పరిష్కారం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వీఆర్ఏ స్వరూప మాట్లాడుతూ, గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్న తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, వేతనాల సవరణ, పదోన్నతులు, ఇతర సౌకర్యాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం, ఎండను లెక్కచేయకుండా గ్రామాల్లో ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. తక్షణమే చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.