BREAKING
thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు
Date of Publish : 01 October 2026, 09:30 am
Posted by : THALLAPALLI LAKSHMANA

రూ.13 వేల కోసం ఎదురుచూపులు..

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
01 Oct, 2026 - 09:30 AM
14 వీక్షణలు

రూ.13 వేల కోసం ఎదురుచూపులు.. తల్లికి వందనం రెండో విడత ఎప్పుడో?


అమరావతి, అక్టోబర్ 1: ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత సాయం కోసం అర్హులైన తల్లులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 30న నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ 30 దాటినా తమ ఖాతాల్లో రూ.13,000 జమ కాలేదని పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మొదటి విడతలో వివిధ కారణాలతో సాయం అందని విద్యార్థులు, కొత్తగా ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులతో కలిపి సుమారు 2.7 లక్షల మంది రెండో విడత కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది.


“పిల్లల చదువుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం ప్రకటించిన రూ.13 వేల కోసం ఎదురు చూస్తున్నాం. విడుదల తేదీ ఎప్పుడు అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఇప్పటికే పాఠశాల, కళాశాల ఖర్చులు పెరిగాయి. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేస్తే మా పిల్లల చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది” అని పలువురు తల్లులు కోరుతున్నారు.


మొదటి విడతలో తమకు ఎందుకు సాయం అందలేదనే విషయంపై సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ రెండో విడత కోసం ఎదురుచూడాల్సి వస్తోందని కొందరు తల్లులు చెబుతున్నారు. కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థుల తల్లులు కూడా తమకు సాయం ఎప్పుడు అందుతుందనే విషయంపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.


నిధుల విడుదలకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం. సీఎంఓ నుంచి ఆమోదం లభించిన అనంతరం నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా రెండో విడత నిధుల విడుదల తేదీని స్పష్టంగా ప్రకటించి, అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.13,000 త్వరగా జమ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.