BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:35 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కందుకూరు నియోజకవర్గంలో 92 పంచాయతీలు గెలవబోతున్నాం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
17 Nov, 2026 - 08:35 PM
7 వీక్షణలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విజయమే నిదర్శనం: ఎమ్మెల్యే ఇంటూరి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి ధీమా

కొత్తగా ఎన్నికైన నలుగురు జడ్పీటీసీలు, 53 మంది ఎంపీటీసీలకు ఘన సన్మానం

ప్రకాశం జిల్లా | కందుకూరు | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

కందుకూరు నియోజకవర్గంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో 92 స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి తరఫున విజయం సాధించిన నలుగురు జడ్పీటీసీలు, 53 మంది ఎంపీటీసీలను సోమవారం ఘనంగా సన్మానించారు.

కందుకూరులోని వెంగమాంబ కల్యాణ మండపంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జడ్పీటీసీలుగా విజయం సాధించిన కోరుకొండ అంజిబాబు, రెబ్బవరపు మాల్యాద్రి, పాలకీర్తి శోభారాణి, రాజారపు మాలకొండయ్యతో పాటు 53 మంది ఎంపీటీసీలను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నాయకులు, వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సాధించిన విజయాలు కందుకూరు నియోజకవర్గంలో కూటమి బలాన్ని చాటాయని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించి 92 స్థానాల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

సర్పంచ్ పదవుల కోసం గ్రామాల్లో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ఎన్నికల కోసం అధికంగా ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. గ్రామాల్లోని నాయకులందరూ పరస్పరం చర్చించుకుని ఒకే అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని, గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏకగ్రీవ ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నాయకులు గ్రూపులుగా విడిపోకుండా ఐక్యంగా ఉండాలని సూచించారు. సర్పంచ్ అభ్యర్థి ఎంపికలో ఒక మెట్టు తగ్గిన వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సమష్టి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పలు గ్రామాల్లో టీడీపీ నాయకులకు తీర్మానాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా ఉంటే గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ పెద్దల నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పరస్పరం చర్చించి అభ్యర్థులను నిర్ణయించాలని తెలిపారు.

ఉలవపాడు మండలంలో కూటమి తరఫున గెలిచిన ఎంపీటీసీల మెజారిటీలు వేలల్లో ఉన్నప్పటికీ జడ్పీటీసీ స్థానంలో ఓటమి ఎందుకు ఎదురైందో సమీక్షించుకోవాలని అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ధామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, పూరిమిట్ల గురునాథం, రాచగర్ల సుబ్బారావు, జనిగర్ల నాగరాజు, మాదాల లక్ష్మీనరసింహం, నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, ఏపీఈడబ్ల్యూఐడీ కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.