BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 09:55 am
Posted by : K MAHESH

అమరవీరుల ఆశయ సాధన కోసం పోరాడాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 09:55 AM
26 వీక్షణలు

కంబాలపల్లిలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సంస్మరణ సభ.. 300 మంది ప్రజల హాజరు

మహబూబాబాద్ (ఎన్ టుడే న్యూస్):

భూమి, భుక్తి, దేశ విముక్తి కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఐలయ్య పిలుపునిచ్చారు.


సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న అమరవీరుల వర్ధంతి సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో సభ నిర్వహించారు. గ్రామంలోని అమరవీరులు కామ్రేడ్ సురేష్ అన్న, సైదులు స్థూపం వద్ద నాయకులు జెండా ఎగురవేసి నివాళులర్పించారు.


ఈ ప్రాంతంలో భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం పోరాడి అమరులైన కందుకూరు రామన్న, వీరబోయిన సాయిలు, దారపు వీరన్న, బైరు సాయిలు, సంద వెంకన్న, కాసనబోయిన ఐలయ్య, బాలు, బిఖ్య, షమీనా, రమణక్క, చార్వాక్ రామ్మూర్తి తదితర కంబాలపల్లి అమరవీరులకు ఘనంగా జోహార్లు అర్పించారు. కార్యక్రమానికి ముందు అరుణోదయ కళాకారుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి

అమరవీరుల సంస్మరణ బహిరంగ సభకు పార్టీ మండల కార్యదర్శి ఎస్.కె. బాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల వెంకన్న, గౌని ఐలయ్య మాట్లాడుతూ.. దోపిడీ, పీడన, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా, భూమి దున్నేవారికే చెందాలనే లక్ష్యంతో ప్రజా ఉద్యమాలు కొనసాగాయని పేర్కొన్నారు.

1969 నుంచి గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో సండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, పోట్ల రామ నరసయ్య, నీలం రామచంద్రయ్య, గడ్డం వెంకట్రామయ్య, రాయల రవన్న, బత్తుల వెంకటేశ్వరరావు, కోటన్న, బాటన్న, ఎల్లన్న, లింగన్న తదితరులు పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని వారు గుర్తుచేశారు. కాచనపల్లి అమరవీరులు, కామ్రేడ్ నంబూరి సీతారామరావు, పరశురాములు, సుసేన, చింతా లక్ష్మి తదితరులు కూడా ప్రజా పోరాటాల్లో ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు.

తమ ఉద్యమ ప్రస్థానంలో ఇప్పటివరకు సుమారు 15 వేల మంది వీరులు, వీరవనితలు ప్రాణత్యాగం చేశారని నాయకులు తెలిపారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావడమే అమరవీరులకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. దోపిడీ, పీడనలు లేని సమాజ నిర్మాణం కోసం సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అమరవీరుల ఆశయాల సాధనే నిజమైన నివాళి

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు హలావత్ లింగన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి గుజ్జు దేవేందర్, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి శివారపు శ్రీధర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు సామ పాపయ్య, కార్యదర్శి బట్టు చైతన్య, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బోనగిరి మధు ప్రసంగించారు. అమరవీరుల ఆశయ సాధన కోసం జరిగే ఉద్యమాల్లో ప్రజలు ఐక్యంగా పాల్గొనాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు సోమనసన్న, లింగంపల్లి లింగన్న, మాదారపు నాగరాజు, కుకముడి యాకయ్య, లంకల ఎల్లయ్య, మాదారం ఎల్లయ్య, పాముల కళమ్మ, మర్రి ఉమా, రఫీ, మహేష్, అనిత, మునిత, కల్పన తదితరులతో పాటు సుమారు 300 మంది ప్రజలు పాల్గొన్నారు.