BREAKING
thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ నూతన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా ప్రకటన thumb ● నిరుపేద కుటుంబానికి అండగా అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం thumb ● పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ thumb ● ఆర్మూర్‌లో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ నూతన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా ప్రకటన thumb ● నిరుపేద కుటుంబానికి అండగా అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం thumb ● పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ thumb ● ఆర్మూర్‌లో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం
Test 4
Date of Publish : 23 November 2026, 06:20 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పి.రాళ్లపల్లి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయానికి సమష్టిగా పనిచేయాలి: డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
23 Nov, 2026 - 06:20 PM
7 వీక్షణలు

నవంబర్ 26న జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐకమత్యంతో ముందుకు సాగాలి

కనిగిరి: నవంబర్ 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సమన్వయంతో, ఐకమత్యంగా పనిచేయాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు.

స్థానిక పార్టీ కార్యాలయంలో వెలిగండ్ల మండలం పి.రాళ్లపల్లి పంచాయతీకి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు దద్దాల నారాయణ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

అనంతరం దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, గత జగనన్న ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని చూరగొనేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో పి.రాళ్లపల్లి సర్పంచ్ అభ్యర్థి ఎగిటి రమణమ్మ (చిన్న తిరుపతయ్య భార్య), మీనిగ బాలయ్య, మేడేబోయిన నారాయణ, జి. అబ్రహం, అంగిరేకుల గురవయ్య, గుర్రవుసాల నారాయణ, కారుమంచి సిద్దయ్య (ఆర్‌ఎంపీ), తగరం వినోద్, మీనిగ వీరయ్య, కీసరి నారాయణరెడ్డి, మితికాల నారాయణ, కేశవరెడ్డి, ముక్కు పెద్దిరెడ్డి, దిబ్బమడుగు చిన్న గుంటయ్య, కుమ్మరికుంట నెహెమియా, గువ్వా చిన్న గురవయ్య, సన్నసాని నారాయణ తదితరులు పాల్గొన్నారు.