BREAKING
thumb ● అయ్యప్ప స్వామి ఆలయ నూతన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా ప్రకటన thumb ● నిరుపేద కుటుంబానికి అండగా అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం thumb ● పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ thumb ● ఆర్మూర్‌లో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ నూతన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా ప్రకటన thumb ● నిరుపేద కుటుంబానికి అండగా అంబేద్కర్ సంక్షేమ సహాయ సంఘం thumb ● పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ thumb ● ఆర్మూర్‌లో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి
Test 4
Date of Publish : 23 November 2026, 06:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భగవాన్ సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ మంత్రి నారా లోకేష్ ప్రకటన..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:37 PM
6 వీక్షణలు

సత్యసాయి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం పుట్టపర్తిలో ఘనంగా 101వ జయంతి వేడుకలు

అమరావతి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన సందేశం విడుదల చేశారు. జయంతి సందర్భంగా రాష్ట్రంలోని సాయి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సమాజంపై ఆధ్యాత్మికంగా విశేష ప్రభావం చూపడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను దేశ విదేశాలకు చాటిచెప్పిన మహనీయుడు సత్యసాయి బాబా అని కొనియాడారు. విద్యాలయాలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాల ఏర్పాటు ద్వారా లక్షలాది మందికి సేవలందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ప్రత్యేక సందేశం ఇచ్చారు. అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు అనే సందేశంతో మానవాళికి ప్రేమ, సేవ, మానవతా విలువలను బోధించిన మహనీయుడు సత్యసాయి బాబా అని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు విలువలపై ఆయన చేసిన బోధనలు నేటికీ ఆచరణీయమని తెలిపారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన సేవా మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. దేశ విదేశాల నుంచి భక్తులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహా సమాధిని దర్శించుకుంటున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం జయంతి ఉత్సవాల్లో పాల్గొని, శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 45వ స్నాతకోత్సవ వేడుకల్లో ప్రసంగించారు. జయంతి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, మొబైల్ మరుగుదొడ్లు, వీధి దీపాలు, ఆహార కేంద్రాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, విమానాశ్రయ అనుసంధాన రహదారులు, అంతర్గత రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మానవ సేవే మాధవ సేవ అనే సత్యసాయి బాబా సందేశాన్ని స్మరించుకుంటూ భక్తులు జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు.