BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:10 am
Posted by : K MAHESH

డప్పు కళాకారుడు రాములు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:10 AM
17 వీక్షణలు

మాజీ జెడ్పీటీసీ హెచ్. వెంకటేశ్వర్లు, సర్పంచ్ పులి వెంకన్న హామీ.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నెల్లికుదురు: పండుగ సందర్భంగా డప్పు వాయిస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన పేద కుటుంబానికి చెందిన డప్పు కళాకారుడు హెచ్. (బొడ్లాడ) రాములు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాజీ జెడ్పీటీసీ హెచ్. వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ పులి వెంకన్న తెలిపారు. రాములు మృతి పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

శనివారం మాజీ జెడ్పీటీసీ హెచ్. వెంకటేశ్వర్లు, సర్పంచ్ పులి వెంకన్న స్థానిక వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి రాములు స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన డప్పు కళాకారుడు రాములు ఆకస్మికంగా మృతి చెందడం గ్రామానికి తీరని లోటని అన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందేలా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

అదేవిధంగా రాములు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు సహకరించిన కాంగ్రెస్ నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నెల్లికుదురు పట్టణ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య, ఉప సర్పంచ్ మంచాల వెంకన్న, వార్డు సభ్యులు హెచ్. కృష్ణమూర్తి, ఐత ఉపేందర్, మాజీ సభ్యులు హెచ్. రవి, రంగస్వామి, సీనియర్ నాయకుడు బొల్లం వెంకయ్య, డాక్టర్ హెచ్. భరత్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.