BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:53 pm
Posted by : K MAHESH

వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 05:53 PM
16 వీక్షణలు

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: వ్యవసాయ అధికారి కే. రాజు

బయ్యారం (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: రాబోయే యాసంగి సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బయ్యారం మండల వ్యవసాయ అధికారి కే. రాజు సూచించారు. శనివారం కాచనపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన, యాసంగి సాగు కోసం పొలాలను సిద్ధం చేసుకుంటున్న రైతులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

గత పంటల అనుభవాలు, ప్రస్తుత సాగు విధానాలు, నీటి లభ్యత తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. బోర్లు, ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే పంటల ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉంటే వరి సాగుకు వెళ్లకపోవడమే మంచిదని తెలిపారు.

అధికంగా నీరు అవసరమయ్యే వరికి బదులుగా తక్కువ నీటితో పండే కంది, పెసర, మినుము, శనగ, జొన్న, నువ్వులు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడి పద్ధతులు పాటించడం, నీటిని పొదుపుగా వినియోగించడం, సాగు ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.

వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని లాభసాటి యాసంగి సాగు చేపట్టాలని వ్యవసాయ అధికారి కే. రాజు రైతులకు సూచించారు.