వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య మద్యం తాగించి నైలాన్ తాడుతో హతమార్చి, మృతదేహాన్ని చెరువులో పడేసిన ప్రియుడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేటలో భర్త గుమ్మడి కాశీరాం (26)తో కలిసి నివసిస్తూ, పసుపుల సంతోష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న గుమ్మడి సవిత అనే మహిళ భర్త అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడు సంతోష్, చింతకింద రాము అనే మరో వ్యక్తితో కలిసి పథకం వేసిన సవిత ఈ నెల 23వ తేదీన మద్యం సేవించడానికి కాశీరాంను పచ్చేరు చెరువు వద్దకు తీసుకెళ్లి, మద్యం మత్తులో ఉండగా నైలాన్ తాడుతో ఉరివేసి చంపి, మృతదేహాన్ని చెరువులో పడేసి పారిపోయిన సంతోష్, రాము కాశీరాం అనుమానాస్పద మృతిపై అతని తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి, సవిత, సంతోష్, రాములను అదుపులోకి తీసుకున్న పోలీసులు