BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 09 October 2026, 01:23 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మహిళపై ట్రాక్టర్‌తో దాడి.. నిందితుడికి ఐదేళ్ల జైలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Oct, 2026 - 01:23 PM
56 వీక్షణలు

మదనపల్లె: దారి, ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో మహిళపైకి ట్రాక్టర్‌ ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ మదనపల్లె 7వ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. గురువారం న్యాయమూర్తి ఆర్. శ్రీలత ఈ తీర్పు ప్రకటించారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలో దారి, ఇంటి స్థలం విషయంలో వివాదం ఏర్పడినట్లు కేసు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళపై కక్ష పెంచుకున్న నిందితుడు ఆమెపైకి ట్రాక్టర్‌ ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి ఐదేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది.