చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
చిత్తూరు: చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. నూతనంగా నియమితులైన వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకటే గౌడ్‌కు స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సమావేశానికి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జి ఎంసీ విజయానందరెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ లీగల్ సెల్‌కు చెందిన 85 మంది న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన న్యాయపరమైన అంశాలు, లీగల్ సెల్ భవిష్యత్ కార్యాచరణ, ప్రజలకు న్యాయపరంగా అందించాల్సిన సహకారం తదితర అంశాలపై చర్చించారు. న్యాయవాదుల భాగస్వామ్యంతో లీగల్ సెల్ కార్యకలాపాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే అంశాలపై సమావేశంలో దృష్టి సారించారు.
పార్టీకి సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాల్లో న్యాయవాదుల పాత్ర, ప్రజలకు అవసరమైన న్యాయ సహాయం అందించే విధానాలపై సమావేశంలో అభిప్రాయాలు పంచుకున్నారు.