BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 06:33 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పెళ్లికి రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తెలంగాణ
/ వికారాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
15 Nov, 2026 - 06:33 PM
14 వీక్షణలు

తుంకిమెట్ల–కోస్గి మార్గంలో కారు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు

వికారాబాద్ జిల్లా: మరో రెండు రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వివాహానికి సిద్ధమవుతున్న యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం తుంకిమెట్ల–కోస్గి మార్గంలో కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. తుంకిమెట్ల–కోస్గి మార్గంలో వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద తీవ్రతకు వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులకు సహాయం అందించారు.

గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో కారులో ప్రయాణిస్తున్న శ్రీశైలం ఉన్నట్లు గుర్తించారు.

అయితే శ్రీశైలంకు మరో రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన లగచర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి ఏర్పాట్లతో సందడిగా ఉండాల్సిన ఇంట్లో ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివాహానికి కొద్ది రోజుల ముందు శ్రీశైలం మృతి చెందడంతో గ్రామంలోనూ విషాదం నెలకొంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుడితో పాటు గాయపడిన వారి పూర్తి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.