టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన యువజన కాంగ్రెస్ నాయకుడు
ఘట్కేసర్, సెప్టెంబర్ 23: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.
భేటీలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, యువజన కాంగ్రెస్ కార్యకలాపాలు, స్థానిక ప్రజా సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. మండల పరిధిలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడం, యువతను సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడు సాయి నిరుడు సాయి కుమార్ పాల్గొన్నారు.