సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
గాడివేముల: గాడివేముల మండలం బుజునూరులో JSW సిమెంట్ లారీ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు గ్రామం మీదుగా సిమెంట్ లారీలు వెళ్లకూడదని డిమాండ్ చేస్తూ రాత్రి వరకు భారీ నిరసన చేపట్టారు.
గ్రామం మీదుగా భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు, JSW సిమెంట్ లారీల రాకపోకలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
గ్రామ పెద్దలు, పోలీసులు జోక్యం చేసుకుని గ్రామం మీదుగా లారీలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు.
ఇదిలా ఉండగా, గురువారం గ్రామం మీదుగా ఒక్క JSW సిమెంట్ లారీ కూడా వెళ్లలేదని స్థానికులు తెలిపారు.