మేడిబోయిన చిన్న బసవయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు
సీఎస్‌పురం: మండలంలోని అరివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు మేడిబోయిన రమణయ్య తండ్రి మేడిబోయిన చిన్న బసవయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సతీమణి దద్దాల మంజు భార్గవి గురువారం మండల పార్టీ నాయకులతో కలిసి చిన్న బసవయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. చిన్న బసవయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు మంజు భార్గవి తెలిపారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాలగుళ్ల మల్లికార్జున్ రెడ్డి, భువనగిరి వెంకటయ్య, మితికాల గురవయ్య, బైరెడ్డి తిరుపతిరెడ్డి, చెరుకుపల్లి రాదయ్య, ఆంజనేయుల రెడ్డి, పాలగుళ్ల రత్నారెడ్డి, బేరీ తిరుపతిరెడ్డి, అంబాల కృష్ణారెడ్డి, గిద్ద మాలకొండయ్య, మేడిబోయిన రాయుడు తదితరులు పాల్గొన్నారు.