కనిగిరిలో వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
హనుమంతునిపాడు
కనిగిరి: వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ ఆదేశాల మేరకు అక్టోబర్ 16, శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కనిగిరిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం (గెస్ట్హౌస్)లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్లతో సమీక్ష నిర్వహించడంతో పాటు అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎంపాడు మండల పరిధిలోని అన్ని పంచాయతీల నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకావాలని మండల కన్వీనర్ వై.ఎస్. రెడ్డి కోరారు.