BREAKING
thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె
Date of Publish : 03 October 2026, 05:05 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
03 Oct, 2026 - 05:05 PM
7 వీక్షణలు

తనకల్లు: తనకల్లు మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బుల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని 17 పంచాయతీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాల్సిన అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడం, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

2029లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని మక్బుల్ పిలుపునిచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సమావేశంలో మండల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.