BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీలో 12 మంది ప్రత్యేక ఆహ్వానితులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 08:07 PM
12 వీక్షణలు

అమరావతి: పౌరసరఫరాల శాఖలోని రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 12 మందిని నామినేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి అధ్యక్షతన అధికారిక, అనధికారిక సభ్యులతో రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీని ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది.

తాజాగా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థలకు చెందిన 12 మందిని అనధికారిక సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం నామినేట్ చేసింది. విశాఖపట్నం నుంచి మర్రి సత్యనారాయణ, కాకినాడ నుంచి కొమ్మూరి శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి జి. అనంతరావు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి బొబ్బిలి బంగారయ్య, ఎన్టీఆర్ జిల్లా నుంచి తరుణ్ కాకాణి, గుంటూరు జిల్లా నుంచి చదలవాడ హరిబాబు, పల్నాడు జిల్లా నుంచి షేక్ మస్తాన్, బాపట్ల జిల్లా నుంచి డి. ఇమ్మాన్యుయేల్, తిరుపతి జిల్లా నుంచి పి. రాజారెడ్డి, అన్నమయ్య జిల్లా నుంచి ఎం. వెంకటరెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా నుంచి సీపీ రమేశ్, శ్రీసత్యసాయి జిల్లా నుంచి గఫార్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది.

రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలు, వినియోగదారుల సమస్యలు, ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాలపై విజిలెన్స్ కమిటీ దృష్టి సారించనుంది. వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కమిటీలో ప్రాతినిధ్యం కల్పించడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది.