BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 11:11 am
Posted by : SEETHA KIRAN KUMAR

216 గంటల భరతనాట్యం… తొమ్మిది రోజుల అద్భుత సాధనతో చరిత్ర సృష్టించిన దీక్ష!

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
11 Nov, 2026 - 11:11 AM
17 వీక్షణలు

కళ మీద ప్రేమ ఉంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చని నిరూపించారు కర్ణాటకకు చెందిన విదుషి దీక్షా V. 

ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకాలోని ఆరూరు గ్రామానికి చెందిన దీక్షా, చిన్నప్పటి నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె తల్లి శుభ హాస్టల్ సహాయకురాలిగా, తండ్రి విఠల్ స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, తన కళపై ఉన్న ప్రేమను మాత్రం దీక్ష ఎప్పుడూ వదులుకోలేదు.

2025 ఆగస్టు 21న ఉడుపిలోని డాక్టర్ జి. శంకర్ మహిళా కళాశాలలో తన నృత్య ప్రదర్శనను ప్రారంభించారు. ఒక్కరోజు కాదు… రెండు రోజులు కాదు… ఏకంగా తొమ్మిది రోజుల పాటు మొత్తం 216 గంటలపాటు భరతనాట్యం ప్రదర్శించారు. ప్రతి మూడు గంటలకు 15 నిమిషాల విరామం తీసుకుంటూ ఈ అసాధారణ ప్రదర్శనను పూర్తి చేశారు.

గతంలో 170 గంటల రికార్డును అధిగమించి, Golden Book of World Recordsలో తన పేరును నమోదు చేసుకున్నారు. 

శారీరక అలసటను, ఎన్నో సవాళ్లను అధిగమించి సాధించిన ఈ విజయం ప్రతి కళాకారుడికి స్ఫూర్తి. 

ప్రతిభకు తోడు పట్టుదల ఉంటే అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకోవచ్చని దీక్షా నిరూపించారు. ఆమె సాధనకు మనస్ఫూర్తిగా అభినందనలు