మోదీ నాయకత్వానికి 25 ఏళ్లు.. చంద్రబాబు ప్రశంసలు
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగ్జిక్యూటివ్ పదవిలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. తన 48 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక మంది నాయకులను, వారి పాలనా విధానాలను చూశానని పేర్కొన్న చంద్రబాబు.. దేశానికి సరైన సమయంలో లభించిన నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు.
దేశ రాజకీయాల్లో మోదీ 25 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రస్థానం ప్రత్యేకమైనదని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ కృషి చేశారని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన నాయకత్వం, నిర్ణయాత్మకత దేశ అభివృద్ధికి దోహదపడిందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న కరోనా మహమ్మారి సమయంలోనూ భారత్‌ను మోదీ సమర్థవంతంగా నడిపించారని చంద్రబాబు అన్నారు. కరోనా తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, ఆర్థిక సవాళ్లు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మారుతున్న పరిస్థితుల మధ్య దేశాన్ని స్థిరమైన మార్గంలో ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు.
మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక సామర్థ్యాలు పెరగడంతో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాధాన్యత మరింత పెరిగిందన