BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:18 pm
Posted by : K MAHESH

35 ఏళ్ల విప్లవ ప్రస్థానం.. కామ్రేడ్ రామకృష్ణకు ఘన నివాళి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:18 PM
16 వీక్షణలు

ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు

బయ్యారం, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన కామ్రేడ్ తోటకూరి రామకృష్ణ సేవలు మరువలేనివని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు అన్నారు. కొత్తపేట గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రామకృష్ణ సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్లవ జోహార్లు అర్పించారు. పార్టీ మండల నాయకుడు మెరుగు మల్ల శంకర్ అధ్యక్షతన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు మైల యాకన్న, మండల నాయకుడు మాదంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సుమారు 35 ఏళ్లపాటు పార్టీ కార్యకర్తగా కొనసాగిన రామకృష్ణ ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. వ్యవసాయ కూలీల వేతనాల పెంపు, తునికాకు ధరల పెంపు, పోడు భూముల సాధన, కుల అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ముందుండి పనిచేశారని తెలిపారు. అనేక ఇబ్బందులు, నిర్బంధాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి వరకు పార్టీ కోసం పనిచేశారని పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు.

ఈ కార్యక్రమంలో యాతం రమణారెడ్డి, కామిశెట్టి నిరంజన్, మాచర్ల సైదులు, కందగట్ల రాముడు, వీరస్వామి, కుంజ నర్సమ్మ, బూర్గుల సురేష్, అరుణోదయ కళాకారులు ఎస్కే మహమూద్, కొండ వెంకటేష్, బంక సంతోష్ తదితరులు పాల్గొన్నారు.