BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 07 August 2026, 08:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

4వ తరగతి విద్యార్థికి అ కూడా రాదా? ఎమ్మెల్యే ఆగ్రహం

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 08:24 PM
104 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పాకలగూడెం ప్రభుత్వ పాఠశాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు.

ఎమ్మెల్యే నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారి చదువు, పాఠ్యాంశాలపై అవగాహన, అక్షర జ్ఞానం తదితర అంశాలను స్వయంగా పరీక్షించారు. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని బ్లాక్‌బోర్డుపై అక్షరం రాయాలని కోరగా, కనీసం ‘అ’ అక్షరం కూడా రాయలేకపోవడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురయ్యారు.

ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు కనీస అక్షర జ్ఞానం లేకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు ఈ స్థాయిలో ఉండటం ఏమిటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ప్రతి విద్యార్థి చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను తప్పనిసరిగా సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

విద్యార్థుల అభ్యాస స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.