వరుసగా 5 రోజులు బ్యాంకులు మూసివేత
సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. సెప్టెంబర్ 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవులు ఉన్నాయి. 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు సమాచారం.
బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఐదు రోజుల పని విధానం అమలు, డీఏ, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్), పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) తదితర డిమాండ్లను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.
వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో ఖాతాదారులు ముందుగానే అవసరమైన బ్యాంకు లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏటీఎంల ద్వారా నగదు అవసరాలను ముందుగానే సమకూర్చుకోవడంతో పాటు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని సూచనలు ఉన్నాయి. 28వ తేదీకి ముందే అత్యవసర బ్యాంకు పనులను పూర్తి చేసుకోవడం మంచిది.