BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 01:58 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పోమాల్‌పల్లి సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

తెలంగాణ
/ మహబూబ్ నగర్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Nov, 2026 - 01:58 PM
15 వీక్షణలు

ఓవర్‌లోడ్, తక్కువ వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం.. విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది

షాద్‌నగర్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ విద్యుత్ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా షాద్‌నగర్ డివిజన్, రాజేంద్రనగర్ సర్కిల్, ఆర్ఆర్ జోన్ పరిధిలోని 33/11 కేవీ పోమాల్‌పల్లి (కొండారెడ్డిపల్లి) సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (PTR-II) ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఎల్వీ-II బ్రేకర్‌తో సహా అవసరమైన పనులు పూర్తి చేసి, 2026 నవంబర్ 19న ఉదయం 10:57 గంటలకు ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా ఐడిల్ ఛార్జ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షల మేరకు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ మార్గదర్శకత్వంలో, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ ఆదేశాలతో నెట్‌వర్క్ విస్తరణ పనులను అధికారులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పోమాల్‌పల్లి సబ్‌స్టేషన్‌లో ఈ పనులు పూర్తి చేశారు.

కొత్తగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌తో ప్రాంతంలో విద్యుత్ సరఫరా మరింత విశ్వసనీయంగా మారనుంది. ఓవర్‌లోడ్ సమస్యలు తగ్గడంతో పాటు తక్కువ వోల్టేజ్ ఇబ్బందులు తొలగి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందనుంది. గృహ, వ్యవసాయ, వాణిజ్య విద్యుత్ వినియోగదారులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ జోన్ చీఫ్ ఇంజనీర్, రాజేంద్రనగర్ ఆపరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆర్ఆర్ జోన్-II డీఈలు, రాజేంద్రనగర్ నిర్మాణ విభాగం డీఈ, షాద్‌నగర్ ఆపరేషన్ డీఈ, ఏడీఈలు, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.