BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 30 September 2026, 09:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఉచిత కోచింగ్‌కు 560 మంది అభ్యర్థులు ఎంపిక

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
30 Sep, 2026 - 09:04 PM
0 వీక్షణలు

వరంగల్, సెప్టెంబర్ 30: ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సహకారంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కోచింగ్‌కు స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన 560 మంది అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. హనుమకొండ జిల్లా భీమారంలోని శుభం ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మాట్లాడుతూ.. గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కోచింగ్ ద్వారా పలువురు అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలు సాధించారని తెలిపారు.

అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ, క్రమశిక్షణతో కృషి చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు.

ఉచిత కోచింగ్‌ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని, క్రమం తప్పకుండా శిక్షణ తరగతులకు హాజరై పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కమిషనర్ సూచించారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని అభ్యర్థులు ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, అడిషనల్ డీసీపీ సురేష్, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, కేయూసీ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.