BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 02:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 02:39 PM
31 వీక్షణలు

అందులో  భాగంగా  విద్యార్థులకు వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహణ

చాట్రాయి నవంబర్ 19: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో గురువారం పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, క్విజ్ పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు, వారి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, వేదికపై మాట్లాడే నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 6, 7, 8 తరగతులకు చెందిన జూనియర్ విభాగం విద్యార్థులకు తమకు నచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడి గురించి మాట్లాడే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. 9, 10 తరగతులకు చెందిన సీనియర్ విభాగం విద్యార్థులకు ఎల్‌ఐ నో (ఎల్‌ఐ నో అంటే ఏమిటి), భారతదేశంపై దాని ప్రభావం అనే అంశంపై పోటీలు నిర్వహించారు.విద్యార్థులు తమకు తెలిసిన విషయాలను చక్కగా వివరిస్తూ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయుడు పి. రత్తయ్య క్విజ్ పోటీలను నిర్వహించారు. సాధారణ విజ్ఞానం, సమకాలీన అంశాలు, వివిధ తరగతుల పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు చురుగ్గా పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలకు ఉపాధ్యాయుడు పి. రత్తయ్య న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని చనుబండ శాఖా గ్రంథాలయ అధికారి కె. శ్రీకాంత్ నిర్వహించారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు పోటీతత్వం, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.