BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 07:09 PM
26 వీక్షణలు

**విద్యార్థినులకు ముగ్గులు, సంగీత కుర్చీల పోటీలు.. ఇందిరాగాంధీ జయంతి వేడుకలు**

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని గ్రేడ్‌-1 శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు సృజనాత్మకత, పోటీతత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా బాలికలకు ముగ్గుల పోటీలు, సంగీత కుర్చీల పోటీలను నిర్వహించగా విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

అదేవిధంగా భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు వక్తలు ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను, ఆమె నాయకత్వ పటిమను కొనియాడారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు, దేశ చరిత్రలో ఆమె పోషించిన పాత్రను గుర్తుచేసుకున్నారు.

గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని, పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, సామాజిక అవగాహన పెరుగుతాయని పలువురు పేర్కొన్నారు. ఇటువంటి వారోత్సవాలు విద్యార్థుల్లో పుస్తకాల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సుంకర నాగేశ్వరరావు, గ్రంథాలయ సిబ్బంది జె. శ్రీలత, మండల ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు డి. మాధవి, కె. విజయలక్ష్మి, తిరువూరు మాజీ సర్పంచ్ ఉయ్యూరు అనసూయ, కవయిత్రి వజ్రాల ఇందిర, అరుణ, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.