BREAKING
thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం
Date of Publish : 04 October 2026, 09:59 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మల్లేలలో 7.58 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 09:59 AM
9 వీక్షణలు

మల్లేలలో 7.58 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం ప్రభుత్వ భూమిని పరిశీలించి ఆధీనంలోకి తీసుకున్న తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్

తిరువూరు: ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ చర్యలు చేపట్టారు. తిరువూరు మండలం మల్లెల రెవెన్యూ గ్రామ పరిధిలోని ఆర్‌.ఎస్‌. నంబర్‌ 281లో నమోదై ఉన్న 7 ఎకరాల 58 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, వాటిపై అనధికార ఆక్రమణలకు అవకాశం లేకుండా చూడడంలో భాగంగా ఈ పరిశీలన చేపట్టినట్లు తెలుస్తోంది. సదరు భూమికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని తిరువూరు తహసీల్దార్‌కు ఆర్డీవో తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలిస్తూ, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్‌, మండల సర్వేయర్‌, గ్రామ సర్వేయర్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.