BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 05:28 pm
Posted by : PAGADALA DEVAIAH

కమలాపూర్‌లో 8 కార్మిక కుటుంబాలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
28 Nov, 2026 - 05:28 PM
24 వీక్షణలు

కలెక్టర్ చాహత్ బాజ్ పాయి చొరవతో స్వగ్రామాలకు ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు

హనుమకొండ, నవంబర్ 28: ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వెట్టి చాకిరికి గురవుతున్న ఎనిమిది కార్మిక కుటుంబాలకు విముక్తి లభించింది. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రత్యేక చొరవతో అధికారులు బాధిత కుటుంబాలను గుర్తించి, వారికి విముక్తి కల్పించడంతో పాటు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనే ఆశతో వందల కిలోమీటర్ల దూరం వలస వచ్చిన ఈ కార్మికులు, ఇటుకల తయారీ కేంద్రం యజమాని వద్ద ఏళ్లుగా అరకొర కూలీతో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి చేరడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు.

అధికారుల విచారణ అనంతరం బాధిత కుటుంబాలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించే చర్యలు చేపట్టారు. అనంతరం వారిని హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌కు తీసుకువచ్చారు. అక్కడ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి బాధిత కుటుంబాలతో ప్రత్యేకంగా మాట్లాడి, ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కార్మికులను ఇబ్బందులకు గురిచేసిన యజమానిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరోసారి ఇలాంటి వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, వెట్టి చాకిరి పనుల్లో చేరవద్దని సూచించారు. పిల్లల భవిష్యత్తు కోసం వారిని చదివించాలని, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, స్వేచ్ఛగా పనిచేసుకుంటూ గౌరవప్రదమైన జీవితం సాగించాలని సూచించారు.

వెట్టి చాకిరి చట్టవిరుద్ధమైన చర్య అని, కార్మికుల హక్కులను హరించే ఇటువంటి వ్యవహారాలను సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్మికులను వెట్టి చాకిరికి గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిమెంట్ ఇటుకల కంపెనీ యజమాని శివకుమార్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్‌ను ఆదేశించారు. కార్మికులు పనిచేసిన రోజులకు సంబంధించిన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు సూచించారు.

మండల స్థాయి బృందం నివేదిక, క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఆర్డీఓ జారీ చేసిన వెట్టి చాకిరి విముక్తి ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ బాధిత కుటుంబాలకు అందజేశారు.

బాధిత కార్మికుల స్వస్థలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావడంతో, అక్కడి జిల్లా కలెక్టర్‌తో చాహత్ బాజ్ పాయి ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలియజేశారు. ప్రత్యేక వాహనంలో కార్మిక కుటుంబాలను హనుమకొండ నుంచి స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. ప్రయాణంలో వారికి భోజనం, పిల్లలకు పాలు, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ చొరవతో వెట్టి చాకిరి నుంచి విముక్తి లభించి, స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంపై బాధిత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌తో పాటు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ వెంకటేష్, కమలాపూర్ తహసీల్దార్ సురేష్ కుమార్, సహాయ కార్మిక అధికారి షర్ఫుద్దీన్, ఇతర అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.