కనిగిరి మున్సిపల్ ఏరియాలో కొత్త పెన్షన్ కొరకు అప్లై చేసిన వారు 988 మంది
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి: ప్రభుత్వం కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరడంతో కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 988 మంది దరఖాస్తు చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు.
వివిధ కేటగిరీల కింద అందిన దరఖాస్తుల వివరాలను ఆయన వెల్లడించారు. వృద్ధాప్య పెన్షన్ కోసం 44 మంది, వికలాంగుల పెన్షన్ కోసం 123 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే చర్మకారుల పెన్షన్ కోసం 65 మంది, డప్పు కళాకారుల పెన్షన్ కోసం 22 మంది, ట్రాన్స్‌జెండర్ పెన్షన్ కోసం 2 మంది, బేవర్స్ పెన్షన్ కోసం 12 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
మిగిలిన దరఖాస్తుల వివరాలు సచివాలయాల నుంచి రావాల్సి ఉందని ఆయన తెలిపారు. అందిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.