BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 08:51 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో నిరుద్యోగులకు దీపావళి కానుక.. డీఎస్సీ-2026 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Nov, 2026 - 08:51 AM
53 వీక్షణలు

2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

నవంబర్ 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ఎన్డీయే ప్రభుత్వం దీపావళి శుభవార్త అందించింది. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా డీఎస్సీ-2026 సమగ్ర నోటిఫికేషన్‌ను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ పోస్టులు 2,111, ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు 350, వివిధ సొసైటీల పరిధిలో మరో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 11 నుంచి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి.