BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:38 PM
24 వీక్షణలు

 ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి పులి కదలికలపై డ్రోన్లతో నిఘా.. ప్రత్యేక నిపుణులతో బంధించేందుకు అధికారుల చర్యలు తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ హెచ్చరిక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట–రంగాపురం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజల్లో అప్రమత్తత అవసరమని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ సూచించారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే గ్రామాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. పెద్దపులి సంచారాన్ని గుర్తించి సురక్షితంగా బంధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతోందని ఆర్డీవో తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ప్రత్యేక ట్రాకర్ల సహాయంతో దాని సంచార మార్గాలను గుర్తిస్తున్నారని వెల్లడించారు. మహారాష్ట్రలోని పూణే, నాగార్జునసాగర్ రిజర్వు అటవీ ప్రాంతాల నుంచి ప్రత్యేక నిపుణులను రప్పించి పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో పొలాలు, అటవీ ప్రాంతాల సమీపంలో తిరిగేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. పశువులను మేతకు తీసుకెళ్లే విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎక్కడైనా పెద్దపులి కనిపించినా, దాని అడుగుజాడలు లేదా ఇతర ఆనవాళ్లు గుర్తించినా ఎవరూ దాని సమీపానికి వెళ్లకూడదని స్పష్టం చేశారు. వెంటనే అటవీశాఖ, రెవెన్యూ లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. పులిని చూసేందుకు గుంపులుగా వెళ్లడం, ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం వంటి పనులకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు అనవసర భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలని, పులిని సురక్షితంగా బంధించే చర్యలకు సహకరించాలని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ విజ్ఞప్తి చేశారు.