కమనీయంగా కళ్యాణ మహోత్సవం
శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆత్రేయపురం లో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మంగళవారం కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఆలయ చైర్మన్ పాతపాటి వెంకట సత్యనారాయణ రాజు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసాయి. అనంతరం ఆలయ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ఆలయ మేనేజర్ వినయ్ కుమార్ రాజు భక్తులు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.