BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 05:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో రాజకీయాల్లో కొత్త పరిణామం.. వ్యక్తిగత విమర్శలకు టీడీపీ, వైసీపీ స్వస్తి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 05:39 AM
79 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలికే దిశగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుకూల సంకేతాలు ఇచ్చాయి. నాయకుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం, దూషణలకు దిగడం వంటి విధానాలకు ముగింపు పలకాలని ఐటీడీపీ ప్రకటించింది. దీనిపై వైసీపీ కూడా సానుకూలంగా స్పందించింది. వ్యక్తిగత దూషణలను పక్కనపెట్టి ప్రజా సమస్యలు, అభివృద్ధి, పాలనాపరమైన అంశాలపైనే రాజకీయ చర్చలు సాగాలంటూ వైసీపీ మద్దతుదారులు చేసిన పోస్టులను ఆ పార్టీ సామాజిక మాధ్యమ ఖాతాల్లో తిరిగి పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు పరస్పర విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలతో సాగిన రాజకీయ వాతావరణంలో ఈ పరిణామం కొత్త చర్చకు దారితీసింది. రాజకీయాల్లో సిద్ధాంతాలు, విధానాలు, ప్రజా సమస్యలపై విమర్శలు ఉండాలి తప్ప నాయకుల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ దూషణలకు దిగకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వైఖరి ఆచరణలో ఎంతవరకు కొనసాగుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత దూషణల స్థానంలో ప్రజా సమస్యలపై చర్చలకు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది.