BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 04:06 pm
Posted by : కూనురు మధు

నకిలీ కారుణ్య నియామకంలో కొత్త ట్విస్ట్! రూ.13 లక్షల

తెలంగాణ
/ నల్గొండ
09 Nov, 2026 - 04:06 PM
82 వీక్షణలు

ఒప్పందంలో రూ.5 లక్షల లెక్కలే తేల్చిన పోలీసులు


మిగతా రూ.8 లక్షలు ఎటు వెళ్లాయి?


ఉన్నతాధికారి, ఇద్దరు జర్నలిస్టులకు చేరినట్లు ఆరోపణలు


నల్లగొండ: 


నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా కారుణ్య నియామకం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రూ.13 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతుండగా, ఇప్పటివరకు రూ.5 లక్షల నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలనే పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.8 లక్షలు ఎవరెవరికి చేరాయనే అంశంపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ ఉన్నతాధికారితో పాటు ఇద్దరు జర్నలిస్టులకు కూడా ఈ వ్యవహారంలో డబ్బులు చేరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం.. సదరు ఉన్నతాధికారికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు, ఆన్‌లైన్‌ మీడియాకు చెందిన జర్నలిస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు, ఓ ప్రధాన పత్రికకు చెందిన జర్నలిస్టుకు సుమారు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం నగదు లావాదేవీల వెనుక ఉన్న వ్యక్తులు, మధ్యవర్తులు, ఇతర సంబంధాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దామరచర్లకు ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపినట్లు సమాచారం. రూ.13 లక్షల వ్యవహారంలో అసలు లబ్ధిదారులు ఎవరు? మిగిలిన రూ.8 లక్షలు ఎక్కడికి చేరాయి? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారి, జర్నలిస్టుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే అంశాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయితే ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.