BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:19 PM
13 వీక్షణలు

 అవినీతికి పాల్పడిన వారెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ అవినీతి ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ ఏలూరు: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆస్తి పన్నుల రూపంలో నగర ప్రజలు చెల్లించిన రూ.1.32 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో కార్పొరేషన్ ఉన్నతాధికారులు విఫలమయ్యారని విమర్శించారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఆర్ఆర్ పేటలోని స్ఫూర్తి భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి కేవలం పన్నుల విభాగానికే పరిమితం కాలేదని, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ఆరోగ్య విభాగాల్లోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. గత కొంతకాలంగా మున్సిపల్ వాహనాలకు వినియోగించే డీజిల్ బిల్లుల్లో కూడా అనేక వ్యత్యాసాలు ఉన్నాయని, వాటిపైనా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, అవినీతికి పాల్పడిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు కష్టపడి చెల్లించిన పన్నుల సొమ్ము అవినీతిపరుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని సూచించారు. కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి ఆరోపణలకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో తరచూ ఏదో ఒక అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తున్నప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతస్థాయి అధికారులను తప్పించేందుకు కిందిస్థాయి ఉద్యోగులపై కేసులు నమోదు చేసి అసలు అవినీతి వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. నగర ప్రజలు చెల్లించిన ఆస్తి పన్నులో రూ.1.32 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై గత సెప్టెంబర్ నుంచి అవినీతి నిరోధక శాఖ పలుమార్లు విచారణ చేపడుతున్నప్పటికీ అసలైన బాధ్యులపై పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఐదుగురు కిందిస్థాయి ఉద్యోగుల నుంచి నగదును రికవరీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా ఎంత మొత్తం దుర్వినియోగమైంది, ఇప్పటివరకు ఎంత రికవరీ చేశారు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై పారదర్శకంగా విచారణ జరిపి, వాస్తవాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఏలూరు ఏరియా కౌన్సిల్ సభ్యుడు కొండేటి రాంబాబు పాల్గొన్నారు.