BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 05:43 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై సమగ్ర విచారణ జరపాలి

తెలంగాణ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
07 Nov, 2026 - 05:43 PM
12 వీక్షణలు

నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసి, ఫీజులు తిరిగి ఇప్పించాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్ గౌడ్

హనుమకొండ (ఎన్ టుడే న్యూస్): ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆ సంస్థ ద్వారా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడానికి వెళ్లిన ఏఐఎస్ఎఫ్ నాయకులు, కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కె. శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి ప్రణీత్ గౌడ్ మాట్లాడుతూ.. ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని విద్యార్థులను నమ్మించి, భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసిందని ఆరోపించారు. అయితే ఫీజులు చెల్లించిన విద్యార్థులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును ఫీజుల రూపంలో చెల్లించినప్పటికీ, వారికి న్యాయం జరగకపోవడం ఆందోళనకరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వ్యవహారంపై అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు వారు చెల్లించిన ఫీజులను తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా బాధిత విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని ప్రణీత్ గౌడ్ తెలిపారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల భాను ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మాలేబోయిన రామ్ చరణ్, రావుల చరణ్, ఆలేటి సాయి తదితరులు పాల్గొన్నారు.