BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 11 June 2026, 07:33 pm
Posted by : V శ్రీనివాస్

​ఆహార భద్రతలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Jun, 2026 - 07:33 PM
233 వీక్షణలు

నస్పూర్‌లో అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణా కార్యక్రమం

​గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ఆహార భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో, ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆహార భద్రత శాఖ అధికారి వాసురాం, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందించే భోజనం యొక్క నాణ్యతను ఆహార భద్రతా శాఖ అధికారులు నిరంతరం పరీక్షించాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే, వాటిపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని, అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

​అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు లభించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు తమ కేంద్రాల్లోని పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల నిరంతరం శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లకు ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ నమోదు ధ్రువపత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు