BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 11 June 2026, 07:00 pm
Posted by : NTODAY NEWS

మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
11 Jun, 2026 - 07:00 PM
180 వీక్షణలు

మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు

సత్యసాయి జిల్లా అమడగూరు, జూన్ 11: భారత ప్రధానమంత్రి Narendra Modi వరుసగా ప్రజల చేత ఎన్నికై దేశానికి సేవలందిస్తూ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం దేశానికి సేవ చేయాలని కోరుతూ అమడగూరు మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సాధారణ కుటుంబంలో జన్మించిన ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతూ, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా నిలవడం ప్రతి కార్యకర్తకు గర్వకారణమని అన్నారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై విశిష్ట స్థానం సంపాదించిందని, దేశ అభివృద్ధి కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. అలాంటి నాయకుడికి దేశ ప్రజలందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

గత 12 సంవత్సరాల కాలంలో ప్రతి పేద కుటుంబానికి ఉచిత బియ్యం, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భద్రత, రైతులకు అనేక సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌలు రైతుల రాష్ట్ర కో-కన్వీనర్ ఎస్. హనుమంత్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఇందుకూరి సురేంద్ర రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఐ. రాము, సుబ్బిరెడ్డి, ఉత్తప్ప, మెరువ రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.