BREAKING
ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం
Date of Publish : 11 June 2026, 08:33 pm
Posted by : NTODAY NEWS

పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్.

తెలంగాణ
/ నల్గొండ
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
11 Jun, 2026 - 08:33 PM
104 వీక్షణలు

19,000 పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

నల్గొండ, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 19,000 పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, పోలీస్ నియామకాలకు వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయం (లైబ్రరీ) వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు నియామక ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతోందన్నారు.

వేలాది మంది యువతీ, యువకులు పోలీస్ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నారని, నియామకాలలో జాప్యం కారణంగా చాలా మంది వయోపరిమితి దాటిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పోలీస్ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని, అభ్యర్థులకు న్యాయం జరిగేలా వయోపరిమితిని 40 సంవత్సరాలకు పెంచాలని కోరారు. అలాగే లాంగ్ జంప్ అర్హతను 3.8 మీటర్లుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

సంతకాల సేకరణ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్, నాయకులు మాదాసు రావణ్, బొమ్మనబోయిన రాజు, కొంగల ప్రసాద్, మల్లం రోహిత్, అదిమల్లా భగత్, శ్రీకాంత్, శివ, అనిల్, రాము, అశోక్, హరీష్, ప్రశాంతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.