BREAKING
ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం
Date of Publish : 27 July 2026, 09:45 am
Posted by : V శ్రీనివాస్

​ఘనంగా మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
27 Jul, 2026 - 09:45 AM
88 వీక్షణలు

​ఘనంగా మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

  •  నూతన చైర్మన్‌గా రామగిరి బానేష్, వైస్ చైర్మన్‌గా జాలే రాయలింగు
  • హాజరైన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ హాజరై నూతన పాలకవర్గాన్ని ఆశీర్వదించారు.

​ఈ సందర్భంగా మంచిర్యాల మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా రామగిరి బానేష్, వైస్ చైర్మన్‌గా జాలే రాయలింగు, వారితో పాటు కమిటీ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులందరినీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ శాలువాలతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తమకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యేను, సురేఖమ్మను నూతన చైర్మన్, వైస్ చైర్మన్లు గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

​పారదర్శకంగా పనిచేసి రైతుల విశ్వాసం పొందాలి: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చూడటంతో పాటు, మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా పనిచేసి మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు.

​ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, మార్కెట్ కమిటీ జిల్లా అధికారులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా RGPRS గడ్డం త్రిమూర్తి, ఆత్మ కమిటీ ఛైర్మన్ సింగితి మురళి, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, జిల్లా OBC అధ్యక్షులు ఒడ్డే రాజమౌళి, జిల్లా నాయకులు నాగభూషణం, మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.