BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి

తెలంగాణ
/ మంచిర్యాల / తాండూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Jun, 2026 - 07:31 PM
180 వీక్షణలు

తాండూర్‌లో అధికారుల శిక్షణను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

మధ్యాహ్న భోజన నాణ్యతపై నిర్లక్ష్యం వహించవద్దు: పాఠశాలల్లో అదనపు వసతుల పరిశీలన

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. గురువారం తాండూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారులతో కలిసి ఆయన బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడాలని, అదే సమయంలో అనర్హుల పేర్ల తొలగింపు ప్రక్రియను చట్ట నిబంధనల మేరకు చేపట్టాలని స్పష్టం చేశారు. ఓటర్ల వివరాల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు సమన్వయంతో పనిచేసి ఓటరు జాబితా నాణ్యతను మెరుగుపరచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

​అనంతరం అదే పాఠశాలలో నిర్వహిస్తున్న ‘ప్రధానమంత్రి పోషణ్’ (మధ్యాహ్న భోజన) పథకం శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వంట సహాయకులతో మాట్లాడి.. విద్యార్థులకు రుచికరమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని అందించడంలో చిన్న అంశాలలో కూడా నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. వంట కార్మికుల సమస్యలు, పాఠశాలల అవసరాలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపునకు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాలల అభివృద్ధిని సామూహిక బాధ్యతగా తీసుకునేలా ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని కోరారు. అనంతరం తాండూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అదనపు మరుగుదొడ్డి నిర్మాణ పనులను ప్రారంభించి, పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు