BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 11 June 2026, 02:52 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా:

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
11 Jun, 2026 - 02:52 PM
100 వీక్షణలు

ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: రూరల్ సీఐ సుబ్బా నాయుడు

NTODAY NEWS చిలకలూరిపేట:  పట్టణంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 16వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రూరల్ సీఐ సుబ్బా నాయుడు తెలిపారు. ప్రత్తిపాటి ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్గదర్శకత్వంలో ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం జరగనుంది.

పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో 16వ తేదీన (మంగళవారం) ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుంది. ఈ మేళాలో సుమారు 50 కంపెనీలు పాల్గొంటున్నాయని, దాదాపు 2,500 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయని సీఐ సుబ్బా నాయుడు పేర్కొన్నారు. 10వ తరగతి నుండి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువతీ యువకులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. నిరుద్యోగుల కోసం ఇలాంటి ఉపాధి కార్యక్రమాలు చేస్తున్న శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి,  ప్రత్తిపాటి శరత్ కు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు , అర్హులైన అభ్యర్థులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాటి ఫౌండేషన్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.